ఎమ్మార్పీఎస్ నాయకున్ని పరామర్శించిన నాయకులు
కథలాపూర్ మండల పరిధిలోని తండ్రియాల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పానుగంటి భాస్కర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుమల గంగారం, సురుగు శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, గురువారం భాస్కర్ ను పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.