కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు దుర్గమ్మకు బోనాలతో నైవేధ్యాలతో సమర్పించారు. మహిళలు బోనాల బిందెలతో ఊరేగింపుగా వచ్చి దుర్గమ్మ చెంతకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలు, సమస్త లోకం సుఖసంతోషాలతో ఉండాలని దుర్గాదేవిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.