జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆదర్శ నగర్ కు చెందిన నాంపల్లి శ్రీరామన్ (17) కనబడుటలేదని పోలీస్ స్టేషన్లో తండ్రి మంగళవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు సిడిఆర్ టెక్నాలజీని ఉపయోగించి మిస్సయిన అబ్బాయిని పెద్దపల్లి జిల్లాలోని కొలనూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడిని 10 గంటల్లోనే ట్రేస్ చేసిన మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.