జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చెరువుకు అతి సమీపంలో ఉన్న ఇండ్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆర్డిఓ శ్రీనివాస్ తో కలిసి శనివారం పరిశీలించారు. చెరువుకు ఆనుకున్న ఇండ్లకు నోటీసులు అందిన కారణంగా కలెక్టర్ స్వయంగా పర్యటించారు. ముందు ముందు ఇటువంటి అక్రమ కట్టడాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు.