గ్యాస్ లీకేజీ తో తప్పిన పెను ప్రమాదం

30659చూసినవారు
గ్యాస్ లీకేజీ తో తప్పిన పెను ప్రమాదం
శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో శనివారము దేవునూరి పోచమ్మ ఇంట్లో గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. పోచమ్మ కుమారుడు శ్రీనివాస్ కర్ర సహాయంతో గ్యాస్ ని బయటకు లాగారు. గమనించిన స్థానికులు ఇంట్లో సామాగ్రి కాలుతుండడంతో నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్