కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం వన్నారం గ్రామానికి చెందిన బానుక రవికి(46), అతని సోదరునికి మధ్య వ్యవసాయ భూమి విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రవి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.