బెజ్జంకీ మండలంలో ఆదివారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. మండలంలోని దాచారం, కల్లెపల్లి, గుండ్లపల్లె తదితర గ్రామాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు వర్షం పడింది. వాతావరణం చల్లబడి అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరి ధాన్యం కల్లాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.