ఇల్లంతకుంటలో టిబి వ్యాధిపై అవగాహన
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో టిబి లేకుండా రూపు మాపడమే తమ లక్ష్యం అని ఆలర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ జిల్లా అధికారి దండుబోయిన శ్రీనివాస్ బుధవారం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మండలంలోని కంది కట్కూర్, వళ్లంపట్ల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, రహీం ఖాన్ పేట సబ్ సెంటర్ లో టీబీ నివారణ పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు.