శంకరపట్నంలో తారకరామనామ మహాయంత్ర జపకోటి యజ్ఞం

581చూసినవారు
శంకరపట్నం మండలం కేశవపట్నంలోని బ్రహ్మా విద్యాశ్రమంలో గురువారం శ్రీ తారకరామనామ మహాయంత్ర జపకోటి యజ్ఞం నిర్వహించారు. అసంగానందగిరి స్వామి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలనం, ప్రధానకలశ స్థాపన, లలితా సహస్ర నామ పారాయణము ప్రసాదవితరణ గావించారు. ఈకార్యక్రమంలో పరిపూర్ణనందగిరి, చిన్మయానంద స్వామీజీలు, నిర్వాహకులు: భక్తి రత్న తణుకు ఓంకారం, పాలడుగుల బాబన్న, కర్మకొండ రాజయ్య, తణుకుసత్యనారాయణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు