సకాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్

77చూసినవారు
సకాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్
జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాల శాఖ, టిఎస్ఎంఐడిసి చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్