రైతులకు ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి

74చూసినవారు
రైతులకు ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీకి సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా వందశాతం రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం స్వామి, ప్రీతం, నవీన్, ప్రణీత్, అశోక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్