అభ్యాసన సామర్థ్యాల పెంపుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

52చూసినవారు
అభ్యాసన సామర్థ్యాల పెంపుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పెంపుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు నిర్వహించిన వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్