సీఎం రేవంత్ పెద్దపల్లి జిల్లాపై బుధవారం వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లికి రూరల్ పోలీసు స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేశారు. అలాగే ఎలిగేడు మండల కేంద్రంలో పీఎస్, వ్యవసాయ మార్కెట్, పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంపు, మంథనిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు, గుంజపడుగులో పీహెచ్‌సీ ఏర్పాటు, పెద్దపల్లికి 4 వరుసల బైపాస్‌రోడ్ మంజూరు చేశారు.