పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్: ప్రధాని మోదీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ విపక్ష పార్టీపై నిప్పులు చెరిగారు. దేశం కోసం ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. జమ్మూలో పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయాడాన్ని వ్యతిరేకించిందన్నారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు.