తాటి చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడుకి గాయాలు

56చూసినవారు
పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం లింగాల గ్రామంలో ఉయ్యాల గంగయ్య గౌడ్ అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా శనివారం తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడం జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్