మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత: ఎమ్మెల్యే

71చూసినవారు
మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత: ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 4వ వార్డుకి చెందిన వరలక్ష్మికి వచ్చిన సూపర్ మార్కెట్ ను అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతరెడ్డి, కమిషనర్ వెంకటేశ్ తో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్