పెద్దపల్లి: రైలు పట్టాలపై 3నెలల పసికందు.. రక్షించిన రైల్వేఅధికారులు

72చూసినవారు
పెద్దపల్లి: రైలు పట్టాలపై 3నెలల పసికందు.. రక్షించిన రైల్వేఅధికారులు
ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును రైల్వే పట్టాల మధ్యన వదిలివెళ్లిన హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే గేటు వద్ద శనివారం చోటు చేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం. పెద్దపల్లి పట్టణం కూనారం రైల్వే గేటు వద్ద పట్టాలపై పసికందును చూసినవారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ డీసీపీ కమలాకర్ ఆదేశాల మేరకు 1098 హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి, సూపర్వైజర్ రమాదేవి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కనకరాజు పసికందును పట్టాల నుండి తీసి రక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్