పెద్దపల్లి: గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి

85చూసినవారు
పెద్దపల్లి: గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం కాపులపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మ్యాదరవేణి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్స్ బుధవారం సాయంత్రం ముగిసాయి. ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్