నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బుధవారం సాయంత్రం ఓదెల మండలం పొత్కపల్లి నుండి శ్రీరాంపూర్ వరకు నిర్మాణం చేయనున్న డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఈకార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, మాజీ ఎంపీపీ గొపగాని సారయ్యగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి పాల్గొన్నారు.