పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలోని ఇండియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న కొందరు రైతులు గందరగోళానికి గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో రైతులకు రెండు లక్షలలోపు వారికి రుణమాఫీ చేసినట్టు విడుదల చేసిన లిస్టులో తమ పేరు లేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. రుణమాఫీ పై మార్గదర్శకాలు వచ్చిన నాలుగు రోజులకే బ్యాంకు అధికారులు రైతులను ఎంపిక ఎలా చేశారని గురువారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.