తబితా ఆశ్రమంకు ఎమ్మెల్యే ఆర్ధిక సహాయం

1384చూసినవారు
తబితా ఆశ్రమంకు ఎమ్మెల్యే ఆర్ధిక సహాయం
రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంను బుధవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలతో కొంత సేపు ఆయన ముచ్చటించి, విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయల నగదును ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్న తబితా ఆశ్రమానికి వెన్ను దన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రామగుండం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, షహేదభాను, కె. మల్లేశం, కనకలక్ష్మి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్