రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే

967చూసినవారు
రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 37వ డివిజన్ లో బుధవారం నిరు పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని నిరు పేదలు, వలస కూలీలకు, కార్మికులకు ఆర్ధిక భరోస కల్పిస్తున్నారన్నారు. లాక్ డౌన్ తో నిరు పేదలు ఎలాంటి అకలి బాధలు పడవద్దని తెల్లకార్డుదారులకు ఒక్కోక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు నెల నిత్యవసర సరుకులు కోసం 1500 రూపాయలు అందిస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అలాగే బత్రుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కులీలకు, కార్మికులకు ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు 500 రూపాలయల నగదు అందించి గొప్ప మనసున్న ఉద్యమనేతగా దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు చెలకపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్