పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి ఇండియన్ బ్యాంకులో క్రాఫ్ లోన్లు తీసుకున్న రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. మంగళవారం గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని స్వశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆమె ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఇండియన్ బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ కాని రైతులకు భరోసా ఇచ్చారు.