రాజీమార్గం రాజమార్గమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు.