విద్యార్థులు కష్టపడి చదువుల్లో రాణించాలని పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో మంగళవారం కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 కుర్చీలను ఎంపీ పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులకు విశాఖ ట్రస్ట్, కాక ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి సహాయం అయినా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ విద్యార్థి నైపుణ్యత కలిగి ఉండాలని, ఉన్నత చదువుతూనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.