పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

4136చూసినవారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో మంగళవారం సాయంత్రం ఒక ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి హమాలివాడలోని ఒక ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని కొంతమంది పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న గడియారం మురళి, బొలీకుంటా మల్లికార్జున రావు, దున్ని రాజేశ్వర్ రావు, పరిపెళ్లి శ్రీనివాస్, రేగారు లచ్చన్న, కట్కూరి సత్యనారాయణ, గడియారం వేణుగోపాల్ అనే ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 10 వేల 370 రూపాయల నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కొరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ కుమార్, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్