సింగరేణిలో ఆకట్టుకున్న వెల్ బేబీ షో

58చూసినవారు
సింగరేణిలో ఆకట్టుకున్న వెల్ బేబీ షో
రామగిరి మండలం సెంటినరీ కాలనీ డిస్పెన్సరీలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉద్యోగుల కుటుంబాల చిన్నారులకు వెల్ బేబీ షో పోటీలు నిర్వహించారు. రామగుండం-3 జీఎం సుధాకరరావు, ఏపీఏ జీఎం వేంకటేశ్వర్లు పోటీలను ప్రారంభించారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ఈనెల 23న నిర్వహించనున్న సింగరేణి దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్