కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పాలకుర్తి మండలంలోని పలు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రం చేయాలని, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాఠశాలల పారిశుధ్యంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.