సిరిసిల్లలో అనుమానాస్పద రీతిలో దంపతులు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. శాంతినగర్‌కు చెందిన ముదాం వెంకటేశ్ (40), వసంత (36) పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్యను కట్టెతో కొట్టి హతమార్చి ఆ తర్వాత భర్త పురుగు మందుతాగినట్లు అనుమానిస్తున్నారు. మృతులకు కుమార్తె వర్షిణి, కుమారుడు అజిత్ ఉన్నారు.