ఇన్స్టాగ్రామ్ లో వేధింపులు.. ఐదుగురిపై కేసు నమోదు: సిరిసిల్ల ఎస్పీ

81చూసినవారు
ఇన్స్టాగ్రామ్ లో వేధింపులు.. ఐదుగురిపై కేసు నమోదు: సిరిసిల్ల ఎస్పీ
విద్యార్థినుల పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో షీ టీం సత్ఫలితాలు సాధిస్తూ మహిళలు, విద్యార్థినులకు అండగా నిలుస్తోందన్నారు. అవసరమైతే 87126 56425 నంబరును సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్