రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ ప్రయాణ ప్రాంగణం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ప్రాంగణంలో ప్రయాణికులు కూర్చోవడానికి వీలు లేకుండా తయారైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ప్రయాణ ప్రాంగణ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.