దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి గుడిలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ముందుగా స్వామి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత అనుబంధ దేవాలయాలను సైతం భక్తులు దర్శించుకుని సేవలో తరించారు.