వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని శుక్రవారం 28వేల 782మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారంతో పోల్చుకుంటే చాలావరకు భక్తులు ఎక్కువగానే వచ్చారనే చెప్పాలి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత కొమురవెల్లి, కొండగట్టు ఆలయానికి భక్తులు వెళ్ళారు.