వేములవాడ అగ్నిమాపక కేంద్రంలో ప్రధాన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న బండారి రాజేంద్రప్రసాద్ కు సేవా పతకం వరించింది. ఈ సందర్భంగారాష్ట్రంలో సంభవించిన వరదలలో ప్రాణానికి తెగించి, 33 మందిని రక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు సేవ పతకం ప్రదానం చేసింది. దీంతో బండారి రాజేంద్రప్రసాద్ కు డివిజనల్ అగ్ని మాపకాధికారి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర అగ్ని మాపకాధికారి అనిల్ కుమార్, సిబ్బంది అభినందనలు తెలిపారు.