పొగాకు వాడకాన్ని నివారించేందుకు చర్యలు: కలెక్టర్

83చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పొగాకు వాడకం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పొగాకు నియంత్రణ కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖల వారు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్