మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని వేములవాడ కౌన్సిలర్, బిఆర్ఎస్ నేత నిమ్మశెట్టీ విజయ్ అన్నారు. బుదవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ (ఐజేయూ)లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ. రాజన్న భక్తులు పవిత్రంగా భావించే, మొక్కుల రూపంలో చెల్లించే కోడెలను మంత్రి కొండ సురేఖ అనుచరులు కళేబరాలకు తరలించాలని మండిపడ్డారు. వెంటనే మంత్రిని భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే బాధ్యతవహించి రాజీనామా చేయాలని కోరారు.