రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం సజావుగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఐతం దేవేంద్ర వెంకటేశం ప్రారంభించగా ఎంపిఓ పాల్గొని చుక్కలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..o-5 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను తమ తల్లి తండ్రులు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, గ్రామస్థులు, ఆశ వర్కర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.