రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మీడియాకు వెల్లడించారు. వేములవాడ రాజన్న టెంపుల్ కి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, వారిని దృష్టిలో పట్టుకొని ప్రత్యేక ప్రణాళికతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ముందుకెళుతున్నట్టు వెల్లడించారు.