సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన మహోత్సవముల 72వ వార్షికోత్సవాలకు వేములవాడ రాజన్న గుడిలో ఓపెన్ స్లాబ్ లో ఈవో కె. వినోద్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో నాదబ్రహ్మ లయ బ్రహ్మ సద్గురు శ్రీత్యాగరాజ స్వామి వారి ఆరాధన మహోత్సవాల 72వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈనెల 18వ తేదీ శనివారం రోజు ప్రారంభం కానున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.