రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు బుధవారం రెండు ద్విచక్రవాహనలు ఢీకొన్నాయి. దీంతో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయాలపాలైన వ్యక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రుద్రంగికి చెందిన కంటే రాములుకు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం ఎక్కువై మార్గమధ్యంలో మృతి చెందాడు. బైక్ పై ఉన్న గడ్డం సంజయ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఏరియా ఆస్పత్రికి తరలించారు.