అధ్వాన్నంగా మారిన అనంతపల్లి-మర్రిగడ్డ రహదారి

650చూసినవారు
అధ్వాన్నంగా మారిన అనంతపల్లి-మర్రిగడ్డ రహదారి
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని అనంతపల్లి గ్రామంలో అనంతపల్లి మీదుగా మర్రిగడ్డ వెళ్లే దారి గుంతలమయంగా మారింది. అనంతపల్లి గ్రామ ప్రజలు చందుర్తి మండలానికి వెళ్ళడానికి ఈ దారే ప్రధానమైనది. ఈ రహదారి గుండా వెళితే పది నిమిషాలు పట్టే సమయం.. ఇప్పుడు రోడ్డు గుంతలమయం కావడంతో ఇరవై నిముషాలు పడుతుందని గ్రామ ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు స్పందించి రోడ్డుకి మరమ్మత్తులు చేసి సమస్యకి పరిష్కార మార్గం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్