వేములవాడ రాజన్న సన్నిధిలో నిద్ర చేస్తున్న భక్తజనం
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అయితే భక్తులు రాజన్న ఆలయంలోనే నిద్ర చేయడం కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వసిస్తున్నారు. గతంలో నిద్ర చేస్తామని మొక్కుకున్నామని, అదేవిధంగా స్వామి వారిని సోమవారం దర్శించుకున్న తర్వాత నిద్ర చేసి మంగళవారం బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి వెళ్తామని భక్తజనం చెబుతున్నారు. భక్తులు నిద్ర చేస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నారు