ఎల్లారెడ్డిపేట: ప్రముఖ న్యాయవాది పశువుల కృష్ణ ఏజీపీగా నియామకం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మండలం బుధవారం అల్మాస్ పురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది పశువుల కృష్ణను తెలంగాణ ప్రభుత్వం ఏజీపీగా నియమించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ మండల ప్రెసిడెంట్ దోమటి నర్సన్న, వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమాల మల్లేశం యాదవ్, తదితరులు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.