రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ శివారులో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీ గుంతలతో చిధ్రమైంది. ఎల్లారెడ్డిపేట-మరిమడ్ల 4 వరుసల ప్రధాన రహదారిలో రాపెల్లివాగుపై వారధి నిర్మాణానికి రాష్ట్ర ఉపప్రణాళిక నిధులు రూ. 2. 20 కోట్లు మంజూరవ్వగా పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం వర్షాలకు బ్రిడ్జికి ఇరువైపులా పెద్దగుంతలు పడి, వాహనాలు అదుపు తప్పుతున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు.