రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారి ప్రక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం వాసిగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలపై ఎస్సై రమాకాంత్ దర్యాప్తును చేస్తున్నారు.