రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు గురువారం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు తమ మనుగడను కాపాడుకునేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.