ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ

58చూసినవారు
ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ
బడాబడా నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోవడం.. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. నేడు పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. మరికాసేపట్లోనే ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌కు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్