బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన మనవడు హిమాన్షుతో మొక్క నాటించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్లో కేసీఆర్ సూచనలతో హిమాన్షు స్వయంగా గుంత తవ్వి మొక్కను నాటి నీరు పోశారు. దీనికి సంబంధించిన వీడియోను Xలో షేర్ చేశారు. 'ఉత్తముల నుంచి నేర్చుకోవడం' అంటూ రాసుకొచ్చారు. వాతావరణ మార్పులనుంచి రక్షించుకోవడానికి అడవుల పెంపకం, సహజ వనరుల పరిరక్షణ మన బాధ్యతన్నారు.