AP: విద్యుత్ బిల్లు రూ.కోటి రావడంతో ఓ జిమ్ నిర్వాహకుడు విస్తుపోయాడు. అనకాపల్లిలో జిమ్ నిర్వహిస్తున్న కె.జగన్నాథరావు కు ప్రతి నెలా సాదారణంగా రూ.18 నుంచి రూ.20 వేలు బిల్లు వచ్చేది. అలాంటిది జనవరి నెల బిల్లు ఏకంగా 1,01,59,217 వచ్చింది. దీనిపై APEPEDCLడీఈఈ సురేష్‌ను ఆయన వివరణ కోరగా పరిశీలించి సరిచేస్తామన్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తికి రూ.200 కోట్లు విద్యుత్ బిల్ వచ్చిన విషయం తెలిసిందే.