AP: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయి.. తాను చనిపోతున్నానంటూ ఓ వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన సతీష్ అనే తాపీమేస్త్రీ.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో తాను తీవ్రంగా నష్టపోయానని, అందుకే తాను చనిపోతున్నానని పేరుపాలెం బీచ్ వద్ద నుంచి తన తమ్ముడికి ఓ సెల్ఫీ వీడియో పంపించాడు. అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.